జిల్లాలో స్పెషల్ డ్రైవ్ మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాబోవు 2 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యఅధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి 21 సెప్టెంబర్(మంగళవారం).

జిల్లాలో స్పెషల్ డ్రైవ్ మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాబోవు 2 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై కరోనా మహమ్మారి రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు.

మంగళవారం సాయంత్రం ఇల్లందు క్లబ్ నందు జిల్లాలో పాపులేషన్ వైజ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎం, హెల్త్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాపులేషన్ వైస్ టార్గెట్ కనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించబడుతుందని రాబోవు రెండు రోజుల్లో 100 శాతం కంప్లీట్ చేస్తామని గ్రామాలు, వార్డుల వారీగా ప్రణాళిక బద్దంగా 100% వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తహసిల్దారు, ఎం.పి.డి.ఓ, మెడికల్ ఆఫీసర్.సమన్వయం వలన విజయవంతం అవుతుంది అన్నారు అన్ని గ్రామాలు, పట్టణాలలో ఆశా,విఓఏ, అంగన్వాడీ, పంచాయితీ కార్యదర్శి , కారోబార్ లను భాగస్వాములను చేయాలని, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి వాక్సిన్ తీసుకోనివారి, మరియు తీసుకున్న వారి జాబితా సిద్ధం చెయ్యాలని, మున్సిపాలిటీకి, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ లను నియమించాలని వైద్యాధికారులను ఆదేశించారు.వ్యాక్సినేషన్ లో భాగంగా జిల్లాలో 4 లక్షల 63 వేల మంది పాపులేషన్ ఉండగా ఇప్పటివరకు 3 లక్షల12 వేల మందికి వ్యాక్సినేషన్ అందించామని మిగతా వారికి రాబోవు రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తామని తెలిపారు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లో కుర్చీలు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించామని వైద్యులు వ్యాక్సినేషన్ పూర్తయ్యేంతవరకు నిరంతరం అందుబాటులో ఉందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, మండల ప్రత్యేక అధికారులు, మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

డిపిఆర్వో జయశంకర్ భూపాలపల్లి వారిచే జారీ చేయడమైనది.

Share This Post