జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ (శాసన మండలి) భాను ప్రసాదరావు ముఖ్య అతిధి జాతీయ పతాకావిష్కరణ

.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 15 (ఆదివారం).

జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ (శాసన మండలి) టి. భాను ప్రసాదరావు హాజరు కాగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిధి జాతీయ పతాకావిష్కరణ భావించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి పై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారక్క జిల్లా మహిళా సమాఖ్యకు 8 కోట్ల రూపాయల చెక్కును అందించారు. జిల్లాలో 9558 మంది రైతులకు 29.55 కోట్ల రూపాయల రుణమాఫీ అందించారు. జిల్లాలోని ఆరుగురు స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకు సేవా పథకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని కమ్మల ప్రజ్ఞ ఆలపించిన దేశభక్తి గీతం అతిథులను ఆకట్టుకుంది.
ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ నాయక్, జెడ్పి వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, జిల్లా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post