జిల్లాలో హరితహారం పనులు పూర్తీ చేయండి, శానిటేషన్ పనులు పర్యవేక్షించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 09, 2021ఆదిలాబాదు:-

ప్రత్యేక అధికారులు వారి పర్యటనలో శానిటేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో శానిటేషన్, హరితహారం, LRS, నర్సరీలు, దళితవాడల అభివృద్ధి, తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాల నేపథ్యంలో డెంగ్యూ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాలు, పట్టణాలలో ప్రత్యేక అధికారులు పర్యటించే సమయంలో శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామాలలో ఉండి శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని, దోమల మందు పిచికారీ చేయించాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, అంతర్గత రోడ్లకు ఇరువైపులా మల్టి లేయర్ క్రమంలో మొక్కలను నాటాలని అన్నారు. ఈ నెల 15 లోగా పూర్తీ చేయాలనీ అన్నారు. గ్రామాలలో నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని వచ్చే వారం లోగా లక్ష్యాల మేరకు మొక్కలను నాటే కార్యక్రమం పూర్తీ చేయాలనీ అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను ప్రారంభించాలని, భూ సమస్యలు ఉన్న మండలాల్లో ఆర్డీఓ ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భవన నిర్మాణాలకు నిబంధనల మేరకు స్వీయ హామీ పత్రం తో నిర్మించుకోవచ్చని, అట్టి నిర్మాణాలు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరానికి కావలసిన నర్సరీలను ఏర్పాటు చేసుకొని ముందస్తుగా మొక్కలు నాటి పెద్ద మొక్కలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మాలో నివేదికలు సమర్పించాలని అందుకు గాను అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో అధికారులు పర్యటించి దళిత వాడల్లో కావలసిన పనులు పరిశీలించి ప్రతిపాదించాలని అన్నారు. పట్టణ ముఖ్య కూడళ్లు, మండల హెడ్ క్వార్టర్లు, జన సంచారం గల ప్రదేశాలలో పబ్లిక్ టాయిలెట్ లను ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో జంక్షన్ ల పనులు, డివైడర్ ల పనులు వెంటనే పూర్తీ చేసి వారం లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తీ చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మండలాల వారీగా చేపడుతున్న పనులపై సమీక్షించారు.  ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జడ్పి సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ శైలజ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓ లు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post