జిల్లాలో హరిత హారంలో 47లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

జిల్లాలో హరిత హారంలో 47లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

చెరువుల వద్ద మొక్కలు నాటేందుకు వంద ఎకరాలకు పై బడిన చెరువులను ప్రతి మండలంలో రెండు గుర్తించండి

క్రీడా స్థలాలను గుర్తించండి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0 0 0 0

     తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 47 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

     గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డి ఆర్ డి ఎ, డి ఎఫ్ ఓ, జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో హరితహారం పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 47 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చెరువు ప్రక్కన గల ఖాళీ స్థలాన్ని గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. వంద ఎకరాలకు పైబడి ఉన్న చెరువులను ప్రతి మండలంలో రెండు చొప్పున జిల్లాలో 30 చెరువుల వద్ద స్థలాలను గుర్తించి బహులస్థాయి (మల్టిలేయర్) మొక్కలను నాటేలా ఇరిగేషన్ అధికారులు మండల స్థాయి హరితహారం కమిటీ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. చెరువు ప్రాంతాల వద్ద ఇప్పటికే ఉన్నటువంటి పెద్దమొక్కలను తొలగించకుండా కొత్తగా యాంటిబయోటిక్ మొక్కలతో పాటు ఇతర మొక్కలను నాటాలని తద్వారా వివిధ ప్రాంతాలు, దేశ విదేశీ వలస పక్షులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. ఇరిగేషన్ అధికారులు స్థలాలు గుర్తించాలని అటవీ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు మొక్కలను నాటడానికి ప్రణాళిక రూపొందిస్తారని పేర్కోన్నారు. చెరువుల వద్ద 100శాతం మొక్కలను నాటాలని తెలిపారు. అదే విధంగా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని, రోడ్ల వెంట బహులస్థాయి (మల్టిలేయర్) మొక్కలను నాటాలని, ఎల్ఎండి తో పాటు జిల్లాలోని ఎస్సారెస్పి కెనాల్ వెంట మొక్కలను నాటించేలా చూడలని తెలిపారు. కెనాల్ వెంట ఉన్నటువంటి సర్కార్ తుమ్మలను తొలగించాలని అన్నారు. క్రీడలకు ప్రాదాన్యం కల్పించేలా ఒక ఎకరం స్థలాన్ని గుర్తించాలని సూచించారు. స్థలాల గుర్తింపులో ఇబ్బందులు, సమస్యలు ఎదురైనట్లయితే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కోన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలను నాటేలా చూడాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తమొక్కలను నాటించి మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ క్రేత్రస్థాయిలో సమీక్షించాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా అటవీ శాఖ అధికారి సి.హెచ్. బాలామణి, జిల్లా ఇరిగేషన్ అధికారి అస్మాత్ అలీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలతారెడ్డి, ఈఈ నాగభూషణం, ఈఈ, తదితరులు పాల్గోన్నారు.

Share This Post