జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న యువతి యువకులకు పరిమిత కాల శిక్షణలు ఇచ్చి ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు

జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న యువతి యువకులకు పరిమిత కాల శిక్షణలు ఇచ్చి ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.  శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలల ప్రిన్సిపాల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో చాలా మంది యువతి యువకులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి యువత కొరకు తక్కువ కాలంతో కూడిన శిక్షణ ఇప్పించి ఉపాధి పొందే విధంగా చూడాలన్నారు.  డ్రైవింగ్, టైలరింగ్, బేకింగ్, ఎం.ఎల్.టి, బ్యూటీషన్, కంప్యూటర్, జి.డి.ఎ, నర్సింగ్ వంటి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.  అయితే న్యాక్, రామానంద తీర్థ, యం.ఎస్.యం.ఈ వంటి సంస్థలు ఇలాంటి శిక్షణలు ఇస్తాయని, ఏ సంస్థ ఏ శిక్షణ ఇస్తుందో వారితో మాట్లాడి సమన్వయం చేసుకునేందుకు కళాశాలల ప్రిన్సిపాల్ లు ముందుకు వచ్చి సంప్రదింపులు చెయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్బంగా ఒక్కో ట్రేడ్ కు ఒక్కో సీనియర్ ప్రిన్సిపాల్ కు బాధ్యతలు అపోతాగించారు.  ఆయా కోర్సులకు ఎవరు శిక్షణ ఇస్తారు, ఉచితమా, ఫీజు ఎంత ఎక్కడ ఇస్తారు అనే అంశాల పై సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  జిల్లాలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు తమవంతు సహకారం అందించాల్సి ఉంటుందన్నారు.  ఒక వారం వరకు ఆయా శిక్షణ ఇచ్చే సంస్థలతో మాట్లాడాలని ఎవరు ఏంచేసారో ఒక వాఁట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో పోస్టింగ్ చెయాల్సిందిగా ఆదేశించారు.  అనంతరం మెగా జాబ్ మేళాలు సైతం నిర్వహించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా దోహదపడాలన్నారు.  అనంతరం  హెచ్.సి.సి టెక్-బి అనే సంస్థ ప్రతినిధి ఒకరు  తాము  ఎంపిసి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు c++,  java,. Paithan   వంటి సాఫ్టువెర్ లో శిక్షణ ఇస్తామని, ఆయా కళాశాలలో 2021, 22 లో పాస్ అయిన విద్యార్థులకు అక్టోబర్ 1వ తేదీన బాలికల జూనియర్ కళాశాల, నాగర్ కర్నూల్ లో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని  ఆసక్తి కలిగిన విద్యార్థులు హాజరు కావాలని కళాశాలల ప్రిన్సిపాల్ లను కోరారు.

ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post