జిల్లాలో 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చేపట్టిన ప్రత్యేక క్యాంపెన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు జిల్లాలో 254 కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపెన్ నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వారందరినీ గుర్తించి వ్యాక్సిన్ అందించాలని ఆదేశించారు.
శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ 21 వ వార్డులో కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ తో కలిసి ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…..
జిల్లాలో రెండు రకాల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒకటి ప్రతి ఇల్లు తిరిగి వివరాలు సేకరించి స్టిక్కర్ అతికించేందుకు మరో టీమ్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వార్డులు, హాబీటేషన్లలో వ్యాక్సిన్ ఇచ్చే టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సర్వే టీమ్ లో అంగన్వాడీ, వి.ఏ.ఓ,బుక్ కీపర్ లేదా సీసీఏ లతో ఏర్పాటు చేయాలని అదే విధంగా టీకా ఇచ్చేందుకు ఏ ఎన్. యం., ఆశ వర్కర్లతో ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా ఉండాలని ఆదేశించారు.
వ్యాక్సిన్ కొరకు గ్రామాలు పట్టణాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను ఎంచుకోవాకోవాలని అందులో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఉండలన్నారు.
కల్వకుర్తి పట్టణంలో 22 వార్డుల్లో 17 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవాలి అన్నారు.
జిల్లాలో 18 సంవత్సరాల పైబడిన వారు 5 లక్షల 58 వేల 700 మంది ఉన్నారని అందులో 2 లక్షల 23 వేల 790 మంది నేటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. మిగతా వారందరికీ రాబోయే 15 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఇందుకు రోజు వారిగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి విద్యార్థికి వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత ఆయా శాఖల అధికారులు తీసుకోవాలన్నారు.
ప్రతిరోజు ఎంతమందుకి వ్యాక్సిన్ తీసుకున్నది రోజువారీ నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు. రాబోయే 15 రోజుల్లో జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న ఇంటికి స్టిక్కర్లు అంటించాలి అన్నారు.
వ్యాక్సినేషన్ పేయవేక్షణకై కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏమైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే 08540 – 230201 నెంబరుకు ఫోన్ చేయాలని తెలియజేయాలన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వారి ఫోన్ నెంబర్లను ప్రజలకు తెలిసే విధంగా చూడాలన్నారు.
స్థానిక శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ భాగ్య స్వాములు కావాలన్నారు.
గ్రామాలలోని ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందికి సహకరించి మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవాస భారతీయుడు అందించిన ఆర్థిక సహకారంతో నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ 30 లక్షలృ రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన 12 పడకల ఐ సి యూ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించారు. ఐసియు కేంద్రానికి సహకరించిన నిర్మాణ్
సంస్థ ప్రతినిధులను అభినందించారు.
ఆసుపత్రిలో గర్భిణీలకు కెసిఆర్ కిట్టు ను అందజేశారు.
ఆసుపత్రి కి కావాల్సిన మౌలిక సదుపాయాల పై కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేతో సమీక్షించారు.
మరుగుదొడ్లు డ్రైనేజ్ తదితర పనులను మున్సిపల్ నిధుల నుండి పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రసూతి భవనానికి దాతల ద్వారా నిర్మాణాలు చేపట్టి 12 పడగలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం వైస్ చైర్మన్ షాహిద్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వెంకటదాసు ఆర్డీవో రాజేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రమేష్, నిర్మాణ సంస్థ ప్రతినిధి సుధీర్, ఎంపీపీ సునీత వైస్ ఎంపీపీ బాలయ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post