జిల్లాలో 2021-22 వానాకాలం పంటలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో రాబోయె ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పత్తి కొనుగోలు, తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి (CCI) కాటన్ కార్పోరెషన్ ఆఫ్ ఇండియా ద్వారా కనీస మద్దత్తు ధరకు పత్తికొనుగోలు జరగాలని, జిల్లాలో 2021-22 వానాకాలంలో రైతులు సాగుచేసె పత్తిపంటపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని, జిల్లాలో పత్తి 78698 హెక్టార్ల విస్థీర్ణంలో సాగు జరిగి 67433 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారుల అంచనా మేరకు, రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎటవంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖలవారిగా చేపట్టవలిసిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతినిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తు ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని, కొనుగోళ్లపై తీసుకునే చర్యలపై నివేదికలను సిద్దం చేస్తూ ఎప్పటికప్పు సమర్పించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం 2021-22 సంవత్సర కనీస మద్దతు ధర మరియ పత్తి నాణ్యత ప్రమాణాలు MSP గోడప్రతులను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా మార్కెట్ అధికారిణి సురేఖ, జెడి వసాయ శాఖ ఉషాదయల్, ఏ డి ఏ దామోదర్ రెడ్డి, ఆర్టీఏ పురుషోత్తం, జిల్లా తునిఖలు మరియ కొలతల శాఖ అధికారి అనిల్ కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి భగవాన్ రెడ్డి, పత్తి మిళ్లు ట్రెడర్స్ భీం రావు, సిసిఐ అధికారి ప్రవీణ్ కుమార్, మార్కెట్ సెక్రటరి, దానయ్య ఏ డి విద్యూత్ ఎలుకతుర్తి, సారంగపాని మార్కెట్ చైర్మన్ పరకాల, ఎఎంసి సెక్రటరీ వెంకటస్వామి, తదితరులు పాల్గోన్నారు.

Share This Post