జిల్లాలో 2021-22 హరితహారం లక్ష్యం 30 లక్షలుగా నిర్దేశించిన జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లాలో  2021-22 హరితహారం లక్ష్యం 30 లక్షలుగా నిర్దేశించిన జిల్లా కలెక్టర్ డి హరిచందన.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం 2020-21 ను విజయవంతంగా పూర్తిచేయడం జరిగిందని రాబోయే సంవత్సరాల్లో సైతం వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో  2021-22-23 సంవత్సరాలకు హరితహారం లో నాటవలసిన మొక్కల లక్ష్యాలను శాఖల వారిగా నిర్దేశించారు.  2022  హరితహారం లో నారాయణపేట జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని 2023 సంవత్సరానికి 26 లక్షలు, కాగా 2024 సంవత్సరంలో సుమారు 20 లక్షలు నాటాలని సూచిస్తూ ఈ మొక్కలు ఏ శాఖ ఎన్ని మొక్కల చొప్పున నాటాలో జిల్లా అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు.  2021 సంవత్సరంలో నాటిన మొక్కలు ఏ ఒక్కటి చనిపోకుండా కాపాడాలని ఆదేశించారు.   జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మూడు వరసలు మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి పాఠశాల లలో పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటాలని, కెనాల్ ల వెంబడి  మొక్కలు నాటేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.  రైతులకు లాభం చేకూర్చే  మొక్కలను అందించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలలో మిగిలిపోయిన వాటి లో పూర్తి చేయాలని సూచించారు.  బృహత్ పల్లె ప్రకృతి వనాలలో  పూర్తి స్థాయి లో మొక్కలు నాటలన్నారు. మున్సిపాలిటీ లలో రోడ్డు కు ఇరు వైపులామొక్కలు నటలని సూచించారు. రహదారుల వెంబడి మూడు వరసలలో మొక్కలు నాటాలని ఇప్పటి వరకు నాటిన మొక్కల ను పరి రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీల పై ఉందని సూచించారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎక్కడైనా  నాటిన మొక్క  చనిపోతే వెంటనే వేరే మొక్కను నాటి రీప్లేస్ చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రతి  మొక్క కు ట్రీగార్డ్ ను అమర్చాలని సూచించారు.

ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వీణవాని, డిఆర్డీఓ గోపాల్, వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా అధికారులు రషీద్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి తదితర పాల్గొన్నారు.

Share This Post