జిల్లాలో 343 గ్రామ పంచాయతీల్లో పోడు సర్వే నిర్వహణకు 702 అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేసినట్లుకలెక్టర్ అనుదీప్ చెప్పారు. 

పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్.ఓ లు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓ లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశములకు అనుగుణంగా పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ఎఫ్.ఆర్.సి లతో పాటు గ్రామ పంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా మొదటగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల నుండి క్లయిమ్ లను స్వీకరించుటకు ఆవాసాల వారిగా సరిపడా ఫారమ్ –ఎ లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అదే విధంగా పూర్తి చేసిన ఫారమ్-ఎ   దరఖాస్తులను అందజేసేందుకు గ్రామస్తులకు తగినంత సమయాన్ని ఇవ్వాలని సూచించారు. పోడు భూములపై గ్రామస్తుల నుండి ఫారమ్ –ఎ  ప్రకారం క్లయిమ్ ల స్వీకరణ,  అవగాహన కార్యక్రమాలను  ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశంపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. పోడు భూములపై గ్రామస్తులకు అవగాహన కల్పించి , పూర్తి చేసిన క్లయిమ్ లు స్వీకరించుటకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆవాసాల వారిగా గ్రామ పంచాయతీ స్థాయి  బృందాలు, ఎఫ్.ఆర్.సి లు గ్రామస్తుల నుండి  పూర్తి చేసిన క్లయిమ్ లను తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ప్రత్యేక కార్యదర్శితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  మాట్లాడుతూ జిల్లాలో 343 గ్రామ పంచాయతీల్లో పోడు సర్వే నిర్వహణకు 702 అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.   ఈ నెల 8వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు జరుగనున్న పోడు భూముల సర్వే ప్రక్రియకు 501 టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్వే ప్రక్రియ నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి సన్నద్ధం చేసినట్లు చెప్పారు. గ్రామస్థాయిలో అటవీ హక్కుల రక్షణ కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. గ్రామస్థాయిలో  ప్రజల  నుండి క్లెయిమ్స్ స్వీకరించడం జరుగుతుందని, ప్రజల నుండి స్వీకరించిన క్లెయిమ్స్ ను రిజిష్టరులో నమోదులు చేయనున్నట్లు  చెప్పారు. సర్వే చేయాల్సిన భూమి అధికంగా ఉన్న హాబిటేషన్లులో  అదనపు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. సర్వే ప్రక్రియ  పర్యవేక్షణకు 21 మంది  మండల ప్రత్యేక అధికారులతో పాటు  టాస్క్ ఫోర్సు, విజిలెన్సు టీములను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోడు సమస్యలపై ప్రజలు పిర్యాదు చేసేందుకు  కలెక్టరేట్ నందు 08744-241910తో కంట్రోల్ రూముతో పాటు వాట్సాప్ ద్వారా తెలియచేసేందుకు  9392919743 నెంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ   ఐటిడిఎ పిఓ గౌతం, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు భీమానాయక్, జిల్లా అటవీ అధికారి రంజిత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సి.సి.ఎఫ్. శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమీషనర్ శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా , గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చొంగ్తు, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్ డి ప్రియాంకా వర్గీస్, అడిషనల్ పిసిసిఎఫ్  ఎన్. సి పరాజిన్,  అడిషనల్ పిసిసిఎఫ్  స్వర్గం శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share This Post