జిల్లాలో ( 8 ) శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు సెంటర్లను వినియోగించుకోవాలి క్వింటాల్ ధర రూ.5335/- ……………అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాలో ( 8 )
శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు సెంటర్లను వినియోగించుకోవాలి

క్వింటాల్ ధర రూ.5335/-
……………అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాలో శనగల
కొనుగోలుకు సంబంధిత అధికారులు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార,తదితర శాఖల అధికారులతో శనగల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు.

జిల్లాలో 18,668 ఎకరాలలో శనగ పంట సాగైందని, సుమారు 13,067 మెట్రిక్ టన్నుల శనగల దిగుబడి వచ్చే అవకాశమున్నట్లు అంచనా ఉందన్నారు.
ఆ మేరకు ఆయా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో 8 శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నాగల్ గిద్ద,రాయికోడ్,జహీరాబాద్, గుమ్మడిదల, సదాశివపేట,ఝరా సంఘం, ఎడాకుల పల్లి, బొక్కస్ గావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వం శనగలు క్వింటాలుకు 5335/- రూపాయల మద్దతు ధర ప్రకటించిందన్నారు.

కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, డిజిటల్ కాంటాలు,అవసరమైన కొత్త గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు.

అదేవిధంగా ట్రాన్స్ పోర్ట్ రవాణా ఏర్పాట్లు చేయాలని, గోడౌన్లను గుర్తించాలని మార్క్ ఫెడ్ అధికారికి సూచించారు.అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉండా లని సూచించారు.

రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న శనగలను తమ వ్యవసాయ విస్తరణ అధికారిచే దృవీక రించుకుని తీసుకు వచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మార్క్ఫెడ్ అధికారి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్, మార్కెటింగ్ అధికారి మల్లిఖార్జున్, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post