జిల్లాల్లో ధాన్యం కొనుగోలు షురూ: అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

*Scroll/ Publish*

*జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు షురూ….*

ఆవునూర్ గ్రామంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్

– రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి..

– తాలు లేని నాణ్యమైన ధాన్యం ను కేంద్రాల వద్దకు తేవాలి
అదనపు కలెక్టర్ సూచన

——————————

యాసంగి సీజన్ లో జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కు కొనుగోలు చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ శ్రీ నాయక్ తెలిపారు.

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని, దళారులకు అమ్మి నష్టపోకూడదని సూచించారు.

 

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం ను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య, ఆర్డీఓ శ్రీ శ్రీనివాస్ రావు లు, స్థానిక ప్రజాప్రతినిధులు లతో కలిసి ప్రారంభించారు. అనంతరం గూడెం గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…

రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు

జిల్లాలో 1,18,893ఎకరాల్లో వరిసాగయ్యిందని, 2,97,232 మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందని, వచ్చే ధాన్యం మొత్తం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ A రకం రూ. 1960 , సాధారణ రకం రూ.1940 కు ధాన్యం కొంటామన్నారు.

ఇందుకు కోసం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 66, ప్యాక్స్ ఆధ్వర్యంలో 185, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 9, మెప్మా ఆధ్వర్యంలో 3, AMC ఆధ్వర్యంలో 2 మొత్తం 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
క్షేత్ర స్థాయిలో డిమాండ్ ను బట్టి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి కేంద్రంలో రెండు ధాన్యం క్లీనర్లు అందించామని తెలిపారు.
రైతు లు తాలు లేని నాణ్యమైన ధాన్యం ను కొనుగోలు కేంద్రాల వద్దకు తేవాలని రైతులకు అదనపు కలెక్టర్ సూచించారు. టోకెన్ ఇచ్చిన ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.

జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లర్ల వద్దకు చేర్చేందుకు 300 లారీలను అందుబాటులో ఉంచామని అదనపు కలెక్టర్ తెలిపారు. అలాగే సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామన్నారు. రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని,అలాగే కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.

*ధాన్యం కొనుగోలుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్*

కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును మానిటర్ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలనూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నదనీ తెలిపారు.

క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే….
*మొబైల్ నంబర్ 6303928692* ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే పరిష్కారం చూపుతామని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

*రైస్ మిల్ ను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్*

ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ ధనలక్ష్మి రైస్ మిల్ ను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎంఆర్ డెలివరీ, గన్ని బ్యాగులు లభ్యతను పరిశీలించారు. అలాగే ధాన్యమును అన్లోడ్ చేసుకునేందుకు రైస్ మిల్ యాజమాన్యం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం ఆర్ డెలివరీ లలో వేగం పెంచాలని
మిల్ కు కేటాయించిన ధాన్యం వెనువెంటనే అన్లోడ్ చేసుకోవాలని అన్నారు.

రైతుల సంక్షేమం, రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని *రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య* అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేందుకు ముందుకు రాకపోయినా రైతుల సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కార్యక్రమంలో dcso జితేందర్ రెడ్డి, dmcs హరి కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు
——————————

 

Share This Post