జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ZP చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన. తేది:4.8.2021
వనపర్తి.

జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అటవీ సంరక్షణ బాధ్యత, అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వనపర్తి జిల్లాలో 5.5% మాత్రమే అడవులు ఉన్నాయని, అటవీ శాఖ విస్తీర్ణం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సూచించారు. అటవీశాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే పచ్చదనాన్ని పెంచాలని, అటవీశాఖ సంరక్షణ బాధ్యత చేపట్టాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సన్ రక్షించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి (IFS) శ్రీనివాస్, అటవీశాఖ అధికారి, వివిధ శాఖల అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.
……
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post