జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణ 7,1, 2022 శుక్రవారం
*జిల్లాస్థాయి ఇసుక కమిటీ
సమీక్ష సమావేశం*

ఇసుక రీచ్ రద్దు చేసినప్పుడు సరైన ఆధారాలు చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో డిఆర్ఓ రమాదేవి, జిల్లా మైనింగ్ ఏడి రఘుబాబు తో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత కమిటీ సభ్యుల తో మాట్లాడుతూ ఈ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం వలన పట్టా భూములలో మరియు సొసైటీ భూములలో ఉన్నా ఇసుక రిచ్ లను ఏర్పాటు చేసి ప్రజల ఉపయోగార్థం ఆయా శాఖల అధికారుల తో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ప్రభుత్వ నిబంధనల మేరకు 7 ఐటీడీఎ ట్రైకార్ కార్పొరేషన్ సంస్థ ద్వారా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఎకో సెన్సిటివ్ జోన్ లో రీచ్ లను అనుమతి నిరాకరించారని జిల్లా కలెక్టర్ అన్నారు. ఫారెస్ట్ అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నట్లు అయితే వాటిని బుధవారం జరిగే జిల్లా స్థాయి సమావేశంని కి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

మొత్తం 262 దరఖాస్తులు రాగ అందులో 139 ఫైనల్ కాగా అవి 88 సోసైటిస్, 51 పట్టా లాండ్స్ ఇసుక క్వారీల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 123 పెండింగ్ దరఖాస్తులను త్వరగా జాయింట్ తనికిలు నిర్వహించి త్వరిత గతిన పరిష్కరించాలని, 7 సొసైటీలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ కృష్ణ ఆదిత్య అదికారులను ఆదేశించారు.

నూతనంగా 6 ఇసుక బియారింగ్ ఏరియాలను గుర్తించడం జరిగిందని,అవి రెండు మంగపేట,4 వెంకటాపూరం లలో ఉన్నాయని, వాటికి గోగుల్ ఎర్త్ ఇమేజెస్, చుట్టు బౌండరీలు గుర్తించి రిపోర్ట్ తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

గ్రామ సభలు ద్వారా సొసైటీలను గుర్తించాలని అన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పంపిన నివేదికలు పలు మార్లు మార్పులు చేస్తూ సమర్పిస్తున్నా రని, నివేదికలు వెల్లడించే ముందు జాగ్రత్తగా పరిశీలించి సమర్పించాలని, ఏదైనా పొరపాట్లు జరిగితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇసుక రీచ్ ల ను రద్దు చేసినట్లు అయితే ఎందుకు రద్దు చేశారో కచ్చితమైన ఆధారాలు చూపాలని ఫారెస్ట్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుదవారం రోజున జరిగే సమీక్ష సమావేశానికి ఫారెస్ట్ అధికారులు,ఇరిగేషన్ అధికారులు ఖచ్చితమైన నివేదికలతో రావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ వో రమాదేవి, ఏడి మైనింగ్ రఘుబాబు, డి సి ఓ సర్దార్ సింగ్, పైసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, డి ఐ రాజ నరసయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post