జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
25 .9 .2021
వనపర్తి

ఇసుక రవాణా లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరగగా ఏ ఎస్ పి షాకీర్ హుస్సేన్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 766 రిజిస్ట్రేషన్ చేసుకున్న శాండ్ టాక్సీ ట్రాక్టర్లు ఉన్నాయని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని బుక్ చేసుకున్న స్లాట్ నంబర్ ప్రకారం పోలీసులు తనిఖీ చేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కిలోమీటర్కురూ.70 ఇస్తున్నామని, డీజిల్ రేట్లు పెరిగినందున రూ 10 పెంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇసుక సరఫరా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసులు, జిల్లా అధికారి విజయ్ రామరాజు, డిపిఓ సురేష్ కుమార్, ఈ ఈ మెగా రెడ్డి,దేశ్య నాయక్ నరేంద్రనాయక్ ఆర్.టి.వో. రమేష్ రెడ్డి తహసిల్దర్ డిప్యూటీ తసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

….. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయడం జరిగింది.

 

Share This Post