జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పద్మజా రాణి

జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పద్మజా రాణి

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుండి జాయింట్ కలెక్టర్ ను తొలగించి ప్రతి జిల్లా కు లోకల్ బాడిస్,  రెవెన్యూ అని   ప్రతి జిల్లా  కు ఇద్దరేసి చొప్పున అదనపు కలెక్టర్ లను నియమించడం జరిగింది.  నారాయణపేట జిల్లా కు ఇదివరకే అదనపు కలెక్టర్ గా కె చంద్ర  రెడ్డి లోకల్ బాడిస్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే  అదనంగా ఇంకో జిల్లా అదనపు కలెక్టర్ గా పద్మజా రాణి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  21-01-2022 నాడు ఉత్తర్వులు జారీచేసింది. నేడు ఉదయం జిల్లా అదనపు కలెక్టర్ గా పద్మజా రాణి కలెక్టరేట్ లో  భాద్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఏఓ నర్సింగ్ రావు, ఖాలీద్ లు కలిసి అదనపు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు  ఇచ్చి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబంద్ది రాణి తదితరులు పాల్గొన్నారు.

Share This Post