జిల్లా అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన తిరిగి విధుల్లోకి చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లు

పత్రికా ప్రకటన      తేది:12.08.2022, వనపర్తి.
     ఫీల్డ్ అసిస్టెంట్ లను తెలంగాణ ప్రభుత్వం తిరిగి విధుల్లోకి చేర్చుకున్న సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ హర్షం వ్యక్తం చేశారు.
     శుక్రవారం ఐ డి ఓ సి. సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ను వారు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలతో సత్కరించడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి చేర్చుకున్న సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
       ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్వాన్, డి ఆర్ డి ఓ నరసింహులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post