జిల్లా అధికారులు తమ పర్యటనల ముందస్తు నివేదికలను సమర్పించాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

జిల్లాలో అధికారుల పర్యటనలకు సంబంధించి ముందస్తు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టరు పి. ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్లు మను చౌదరి, శ్రీనివాసరెడ్డి లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ……
అన్ని శాఖల జిల్లా అధికారులకు సంబంధించి ముందస్తు పర్యటనల డైరీ వివరాలు ఎంత మంది సమర్పించారు? ఇంకా సమర్పించాల్సిన వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అధికారుల అడ్వాన్స్‌ టూర్‌ డైరీని సమర్పించాలని అందరు అధికారులను కలెక్టరు ఆదేశించారు.
జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ని కార్యాలయాలను సందర్శించి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేలా చూడాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ సమర్థవంతంగా అందేలా చూడాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసేలా క్షేత్రస్థాయి పర్యటనలు ఉండాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post