జిల్లా అధికారుల లాగిన్ లో పెండింగ్ ఉన్న ప్రజా పిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

జిల్లా అధికారుల లాగిన్ లో పెండింగ్  ఉన్న ప్రజా పిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా  చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జేన్సి సమావేశం లో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వివిధ అంశాలకు సంబందించిన సమస్యలు అన్ని శాఖలలో పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరమయ్యేటట్లు చూడాలని, ప్రతి వారం  మీ కార్యాలయ  ప్రజావాణి లాగిన్ చెక్ చేసి వచ్చిన దరకస్తులను  పరిష్కరించి పంపించాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

అనంతరం ప్రజావాణి పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 48  ప్రజా పిర్యాదులు వచ్చాయని , వాటిలో ఎక్కువ  భూ సమస్యలు వచ్చాయని , వాటిని సంబ0దిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరామయ్యేలా చూస్తామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.

తదనంతరం రానున్న రెండు రోజుల్లో  భారి నుండి అతి బారి వర్షాలు వచ్చే అవకాశామున్నందున  జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని, వర్ష సూచన వల్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని,  ప్రజల అత్యవసర సేవలకొరకు కల్లెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూం 7993499501,08546-274007  టోల్  ఫ్రీ నెంబర్లకు  సమాచారమివ్వాలని, కాంట్ర్లోల్ రూమ్ నందు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.

సమవేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు, శ్రీహర్ష, రఘు రామ్ శర్మ, ఆర్ డి ఓ రాములు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

Share This Post