జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య అన్నారు.

జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య అన్నారు.

గురువారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో రెండవ స్థాయి సంఘం గ్రామీణ అభివృద్ధి సమావేశాలు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పి ఆర్,  మిషన్ భగీరథ, సివిల్ సప్లై, మద్యనిషేధం తదితర శాఖల అధికారులు పాల్గొని వారి శాఖల ప్రగతి గురించి సభకు వివరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పల్లెపాడు, బోరవెల్లి రోడ్డు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో కొత్తగా మంజూరైన రోడ్ల పనులకు  టెండర్లు పిలిచినా ఎవరు రావడం లేదని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. అయిజ మండలం మేడికొండ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని అందజేయాలని అన్నారు. మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ నీరు అందించేలా కృషి చేయాలని అధికారులకు  ఆదేశించారు. సమావేశం ఏర్పాటు చేసుకుని మన ఊరు, మన బడి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు. ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామంలో పైపులైన్ సమస్య ఉందని దానిని పూర్తి చేయాలన్నారు. అనేక గ్రామాలలోనీటి  ట్యాంకుల నుండి నీరు వృధాగా పోతుందని, దానిని అరికట్టాలని అధికారికి ఆదేశించారు. ప్రతి మండల సమావేశం లో మినరల్ వాటర్ కు  బదులుగా  మిషన్ భగీరథ నీరు అందజేసేలా ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులపై మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం అట్టహాసంగా చేస్తున్నారూ  ,రోడ్ల ప్రక్కన మొక్కలు సరిగా పెరగడం లేదని, కొన్ని చోట్ల మొక్కలు కాల్చి వేస్తున్నారని ,అలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, రోడ్డు హద్దులు ఏర్పాటు చేసి మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈఓవిజయా  నాయక్, డిఆర్డిఓ ఉమాదేవి,  సంబంధితశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి  జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

 

 

 

 

 

 

Share This Post