జిల్లా ఎన్నికల అధికారి   మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు గా నమోదైన 2022 మందికి జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 నాటికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు తో పాటు, ఓటర్ కిట్ అందచేస్తామని తెలిపారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) బి.ఎల్.ఓ.ల ద్వారా అందచేయాలని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్  తెలిపారు.  బుధవారం హైద్రాబాద్ నుండి ఎపిక్ కార్డులు జారీ, ఓటు హక్కు వినియోగంపై  స్వీప్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ నూతన కొత్తగా ఓటరు గా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీపై సూచనలు చేశారు. జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు ఎపిక్ కార్డు ను పోస్టు ద్వారా అందజేసే విధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్లను సూచించారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ,ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు, మార్పులు చేర్పులు సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ఏకరీతిగా ఫోటోలు ఉన్న జాబితా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.    ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాలకు సంబంధించిన ఎపిక్ కార్డులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి తీసుకువెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ.వి.యంలు భద్రపరచిన గోదాములను సందర్శిస్తూ ఉండాలని, కొత్త ఈ.వి.యం. భవనాలకు ఈ.వి.యం లు  మార్చని వారు వెంటనే మార్చవలసిందిగా తెలియజేసారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్లైన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు. స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలియజేసారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరిస్తామని తెలిపారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఓ. మధుసూదన్ రాజు, ఎన్నికల సూపరింటెండెంట్ రాజు, సిబ్బంది నవీన్   తదితరులు పాల్గొన్నారు.

Share This Post