జిల్లా ఏరియా ఆస్పత్రిలో వైద్య కళాశాల అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…..

ప్రచురణార్థం–
మహబూబాబాద్ అక్టోబర్04

జిల్లా ఏరియా ఆస్పత్రిలో వైద్య కళాశాల అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం మధ్యాహ్నం ఏరియా ఆస్పత్రిలో వివిధ నూతన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాల తరగతి గదులను ఆకర్ష వంతమైన పద్ధతుల్లో శరవేగంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని మెప్మా వారిని ఆదేశించారు. ప్లాన్ మ్యాప్ ను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు ఉండేటట్లు చూడాలని మెప్మా వారికి కలెక్టర్ తగు సూచనలు చేశారు. ముందస్తు ప్రణాళికలతో ఆస్పత్రి మేనేజ్మెంట్ సమిష్టిగా ఉంటూ సేవలందించాలని, సమయాభావం పాటిస్తూ జరుగుతున్న పనులపై , ఆసుపత్రి సిబ్బందిపై రోగులపై ప్రత్యేక దృష్టి సాధించాలని, వైద్యులను కోరారు. ఫ్లోర్ వారిగా నిర్మించాల్సిన టాయిలెట్ల పనులను కమిటీలు ఏర్పాటు చేసుకోని, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, త్రాగునీరు సమస్యలు లేకుండా, చూడాలని , ఆస్పత్రిలో నూతన ఒరవడిని తీసుకురావాలని, తక్షణమే టాయిలెట్స్ కరెంటు పనులను ప్రారంభించాలని, మార్చురీని కూడా నూతనంగా నిర్మించుకోవాలని రోగుల పట్ల ప్రేమతో ఉంటూ సరైన సమయంలో వైద్యాన్ని అందించాలని తలెత్తుతున్న పెద్ద సమస్యలపై దృష్టి సాధించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపర్డెంట్ వెంకట రాములు, ఆర్ ఎం వో వైదేహి, వివిధ ప్రత్యేక వైద్య నిపుణులు, ఇంజనీరింగ్ శాఖ టి ఎస్ ఎo ఐ డి సి ఈఈ ఉమామహేష్,డీ ఈ శ్రీనివాస్,లు మెప్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది
——————————————————————-

Share This Post