జిల్లా కలెక్టరేటులో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు : జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా

పత్రిక ప్రకటన
13. 10. 2021.
వనపర్తి జిల్లా

వనపర్తి జిల్లా కలెక్టరేటులో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా పాల్గొని వేడుకలలో ఆడి పాడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి అందాలను పేర్చి బతుకమ్మ పండుగ ఆడతారని, ప్రతి ఇంటిలో మహిళలు బతుకమ్మలో గౌరమ్మను చూసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మహిళను గౌరవించే సంప్రదాయం తెలంగాణ లో ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రాదయాలను కనుమరుగు కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని, ప్రపంచంలో ఎక్కడాలేని పూల పండుగ మన రాష్టంలో బతుకమ్మ పండుగని చేసుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను అందరం కలిసి చేసుకుంటామని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామని,అద్బుతమైన ఈ పండుగను బావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ పుష్పలత , థామస్, కృష్ణచైతన్య ,కవిత సీడీపీఓలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు
———————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post