జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం ఆళ్లపల్లి మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి వర్షం వల్ల రహదారుల్లో నీరు నిలిచిన ప్రాంతాలు, బృహత్ పల్లె ప్రకృతి వనం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,  తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

భారీ వర్షాలు వల్ల నీరు నిలిచిన రహదారులపై ప్రజలు రవాణా చేయకుండా నియంత్రణకు చేపట్టిన చర్యలను పరిశీలించారు.  నీరు తగ్గిన తదుపరి రవాణా సౌకార్యం పునరుద్దరణ చేయాలని చెప్పారు.    నీరు ప్రవహించడంతో  బారికేడ్ చేయబడిన రాయపాడు లో లెవల్ కాజ్‌వే పరిశీలించారు.  ఆళ్లపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేశారు.  మొక్కల వేయు కార్యక్రమం పూర్తిగా జరగలేదని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 కంటే ఎక్కువ ఎత్తున్న మొక్కలు నాటాలని చెప్పిన ఎందుకు   అడుగు ఎత్తున్న   మొక్కలను  నాటారని ఎంపిడిఓ ను ప్రశ్నించారు.   భగత్ సింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని  గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై  కలెక్టర్ రోడ్డు నిర్మాణం  కోసం అంచనా నివేదికలు తయారు చేయాలని పీఆర్ ఏఈ ని ఆదేశించారు.  మర్కోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.  వాక్సిన్  ఆన్‌లైన్‌ ప్రక్రియ  నెమ్మదిగా జరుగుతున్నట్లు గమనించి వేగవంతం చేయాలని ఆదేశించారు. వాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి వివరాలు  ఆన్లైన్ చేయాలని చెప్పారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకునే విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి  రికార్డులను పరిశీలించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపిడిఓ మంగమ్మ,  తహసిల్దార్  సాధియా సుల్తాన తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post