జిల్లా కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆట పాటలతో కోలాటం ఆడి ఉత్సాహం నింపారు.

మంగళవారం ప్రగతి మైదానంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగ అద్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా గౌరమ్మ ఉయ్యాల .. బంగారు ఉయ్యాల అంటూ నృత్యం చేస్తూ మహిళతో కోలాటం ఆడారు.   తెలంగాణ సంస్కృతి  సంప్రాదయాలు కనుమరుగు కాకుండా ఉండాలన్న ద్యేయంతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విదంగా మహిళలు రంగు రంగుల  పూలతో బతుకమ్మను పేర్చి ఆట పాటలతో 9 రోజుల పాటు పండుగని చేసుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను అందరం కలిసి  చేసుకుంటామని అన్నారు.  మన రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామని, అద్బుతమైన ఈ పూల పండుగను బావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంగ రంగ వైభవంగా  నిర్వహించారని అభినందించారు.  తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎంత అబివృద్ది సాధించినా మన సంప్రదాయాలు కాపాడు కోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సీతాలక్ష్మీ, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  టిజిఓ అధ్యక్షుడు వెంకట పుల్లయ్య, పీఆర్ ఈ ఈ సుధాకర్,   జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, ఆర్ ఐ ఓ సులోచన, పాల్వంచ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post