జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు, సమీకృత కలెక్టరేట్, అధికారుల నివాస సముదాయాల నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు.

కలెక్టరేట్ ప్రాంగణంలో అందమైన పూల మొక్కలు నాటాలని చెప్పారు. జనవరి 15 వ తేదీ నాటికి నర్సింగ్ కళాశాల మొదటి బ్లాకు స్లాబు పనులు పూర్తి చేయాలని, రెండవ బ్లాకు నిర్మాణ పనులు ప్రత్యామ్నయంగా చేపట్టాలని చెప్పారు. స్లాబు వేసిన బ్లాకులో బ్రిక్స్ పనులు నిరంతరాయంగా జరగాలని చెప్పారు. నిర్మాణ పనులు నిరంతరాయంగా జరిగేందుకు మెటీరియల్ కొరత లేకుండా ముందస్తు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఫిబ్రవరి మాసాంతం వరకు నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని చెప్పారు. నిర్మాణ పనుల్లో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారని, పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. పనులను పరిశీలించిన ఆయన పురోగతి బావుందని ర.భ. అధికారులను, ఏజన్సీలను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ నిర్మాణ పనులను, అధికారుల నివాస సముదాయాల పనులను పరిశీలించారు. నిధులు కొరత లేదని పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టరేట్ తో పాటు అధికారుల నివాస సముదాయాల పనులు కూడా పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. 24 గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నయంగా జనరేటర్ ఏర్పాటు చేయుటకు ప్రతి పాదనలు అందచేయాలని ర.థ. అధికారులకు సూచించారు. నివాస సముదాయాల్లో మొక్కలు నాటేందుకు గ్రీనరీ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. ఇంటీరియల్ పనులను పరిశీలించారు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల్లో ఎక్కడా రాజీపడొద్దని ఏదేని సహాయత కొరకు తనను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ర.భ. ఈఈ భీమ్లా, డిఈ నాగేశ్వరావు, తహసిల్దార్ స్వామి, సైట్ ఇంజనీర్ నరసింహారావు తదతరులు పాల్గొన్నారు.

Share This Post