జిల్లా కలెక్టర్ అనుదీప్ రెవిన్యూ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ధరణి, ధృవీకరణ పత్రాలు జారీ, రెండు పడక గదుల ఇండ్లు నిర్మాణాలు, లబ్దిదారుల ఎంపిక, మౌలిక సదుపాయాలు కల్పన, జిఓ నెం. 76 ప్రకారం ఇంటిస్థలాలు, క్రమబద్ధీకరణ, లబ్దిదారుల ఎంపిక, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, గోదావరి వరదలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రచురణార్ధం

భద్రాద్రి కొత్తగూడెం:- జులై 29, 2021.

కుల, ఆదాయ వారసత్వ తదితర ధృవీకరణ పత్రాలను జారీలో జాప్యం చేయకుండా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తహసిల్దారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు రెవిన్యూ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ధరణి, ధృవీకరణ పత్రాలు జారీ, రెండు పడక గదుల ఇండ్లు నిర్మాణాలు, లబ్దిదారుల ఎంపిక, మౌలిక సదుపాయాలు కల్పన, జిఓ నెం. 76 ప్రకారం ఇంటిస్థలాలు, క్రమబద్ధీకరణ, లబ్దిదారుల ఎంపిక, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, గోదావరి వరదలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు, అధికవర్గాల సమయంలో వీఆర్వో నుండి తహసిల్దార్ వరకు, సబ్ కలెక్టర్, ఆర్జీఓ బాగా పనిచేశారని ముందస్తు సన్నద్ధత మంచిగా అనుకూలించిందని. అభినందించారు. విపత్తుల సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా బాగా పని చేయాలని ఆయన సూచించారు. గోదారవ వరదలు, అధికవర్గాల వల్ల పంట, ఇండ్లు, పశువులు నష్టపోయిన జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వరదల సమయంలో ప్రమాదం పొంచి ఉన్నందున వాటర్ ఫాల్స్, చెరువులు, వాగులు, నదులను వీక్షించడానికి ప్రజలను అనుమతించారని చెప్పారు. గోదావరి వరదలకు సంబంధించి తయారు చేయబడిన ఫ్లడ్ మాన్యువల్ు అప్డేడేట్ చేయాలని డి ఆర్ వో కు సూచించారు. బృహత్ పకృతి వనాలు ఏర్పాటుకు కేటాయించిన భూ వివరాలను అడిగి తెలుసుకుని భూమిని యంపిడిఓలకు అప్పగించాలని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదంతో మంచి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాటు చేయనున్న బృహత్ పకృతి వనాలు ఏర్పాటు పట్ల స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేశారని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలకు మంచి పకృతి వనాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిషన్ బగీరధ నీటి సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని డి ఆర్ వో కు సూచించారు. కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో జిబినెం. 76 ప్రకారం ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. కొత్తగూడెంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విచారణ ప్రక్రియను పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీఓకు సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు నిధులు అందుబాటులో ఉన్నాయని, వచ్చిన దరఖాస్తులను తక్షణం విచారణ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ ప్రతి శుక్రవారం ఇట్టి లబ్దిదారుల యొక్క సమగ్ర జాబితాను అందచేయాలని, జాప్యం లేకుండా ఆర్థిక సాయం అందించేందుకు పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టరేట్ ఏమీ గన్మా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీలో జాప్యం వల్ల నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోల్పోయారని, చక్కటి అవకాశం నిరుపేద వర్గ విద్యార్థులకు చేజారిపోయిందని చెప్పారు. మండల వారిగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు, పంపిణీ, పెండింగ్ అంశాలపై శుక్రవారం వరకు తనకు నివేదికలు అందచేయాలని చెప్పారు. పట్టాదారు పాసుపుస్తకాలు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, రృవీకరణ పత్రాలు జారీ చేయకుండా పెండింగ్ ఉంచితే సంబంధిత తహసిల్దార్పై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ అశోక్ చక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, ఏఓ గన్యా, అన్ని మండలాల తహసిల్దారులు, నాయబ్ తహసిల్దారులు, ఈడియం విజయసారధి తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ద్వారా జారీ చేయబడినది.

Share This Post