జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో డ్రా ద్వారా 53 మద్యం దుకాణముల కేటాయింపు.

వికారాబాద్ జిల్లాలో ఈరోజు 59 మద్యం షాప్ లకు గాను 840 దరఖాస్తులు వచ్చాయని, జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొడంగల్ లో ఆరు, తాండూర్ లో 01చొప్పున 06 దుకాణాలకు డ్రా నిలిపి వేయడం జరిగిందని, మిగతా 53 షాపులకు లాటరీ పద్ధతిన స్థానిక అంబేద్కర్ భవనములో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ప్రక్రియ పరదర్శకంగా నిర్వహించి ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. మిగిలిపోయిన ఆరు షాపులకు త్వరలో డ్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. SHO వికారాబాద్ -15, SHO పరిగి – 12,
తాండూర్ – 17, కొడంగల్ – 03, మోమిన్ పేటలో 06 చొప్పున డ్రాలు నిర్వహించి లైసెన్సలు అందించడం జరుగుతుందన్నారు. ఇట్టి షాపులు డిసెంబర్, 1st నుండి నిర్వహించుకొనుటకు అనుమయించ బడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, అసిస్టెంట్ కమీషనర్ పల్లవి తో పాటు ఎక్సయిజ్ శాఖ సీఐ లు, యస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post