జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఆర్జెడి విజయలక్ష్మి, డీఈవో గోవిందరాజులు జిల్లాలో పది పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు

రెండోవ రోజు పదవ తరగతి పరీక్షలు నాగర్ కర్నూలు జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి.
రెండోవ రోజు హిందీ పరీక్షకు 1,1060 మంది విద్యార్థులకు గాను 140 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 10920 మంది విద్యార్థులు హాజరు కాగా 98.73% హాజరు శాతం నమోదయిందని, డిఈవో గోవిందరాజులు తెలిపారు.
హిందీ పరీక్ష రెండో రోజు దోమలపెంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, కల్వకుర్తి, తాడూరు, పరీక్ష కేంద్రాలను హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయలక్ష్మి తెలకపల్లి, అచ్చంపేట లోని పరీక్ష కేంద్రాలను డీఈవో గోవిందరాజులు ఆకస్మికంగా సందర్శించారు.
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
సీసీ కెమెరాల పని తీరును పరిశీలించి, వివరాలను చీప్ సూపరింటెండెంట్లు లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్లు, బృందంలో తాహసిల్దార్లు పుష్పలత, ముజీబ్ హుస్సేన్, ఎస్.ఎం.కృష్ణ, మండల విద్యాధికారులు భాస్కర్ రెడ్డి, చంద్రుడు నాయక్, శంకర్ నాయక్ పరీక్షల నిర్వహణాధికారి రాజ శేఖర్ రావు, నోడల్ అధికారి కురుమయ్య జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి లు విద్యాశాఖ అధికారులు మొత్తం 44 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని, పోలీసు బందోబస్తు మధ్య పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని డిఈఓ తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల ఫ్యాన్లు త్రాగునీరు మరియు ప్రథమ చికిత్స ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు హిందీ పరీక్ష పదోవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Share This Post