జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో DLSC కమిటీ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం ములుగు జిల్లా
30.11.2021 ( మంగళవారం)

జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో (DLSC)చర్చించిన అంశాల పై సమగ్ర నివేదికలు తయారుచేసి చర్యలు చేపట్టాలని టి ఎస్ ఎన్ డి సి, ఇరిగేషన్ ,అధికారులను జిల్లా కలెక్టర్ డిఎల్ఎస్సి చైర్మన్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
మంగళవారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డి ఆర్ వో రమాదేవి, ఏడి మైన్స్ రఘుబాబు టిఎస్ఎండిసి, ఇరిగేషన్, ఐటీడీఏ పిసా కోఆర్డినేటర్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డిఎల్ఎస్సి) సమావేశం ఏర్పాటు చేసి ఇసుక సొసైటీలు 69 ధారఖస్తు రాగా,వాటికి జాయింట్ సర్వే నిర్వహించడం జరుగుతుందని, పట్టా భూముల దరఖాస్తులు 88 రాగా, వాటి జాయింట్ సర్వే నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. పెండింగ్లో ఉన్న అప్లికేషన్ వివరాలు ఇరిగేషన్ నివేదికలు ,అటవీశాఖ క్లియరెన్స్
చేసిన ఇసుక ఉన్న పట్టా భూముల ఏరియాలకు సంబంధించి పీసా గ్రామ సభ ఏర్పాటు చేయడం సంబంధిత విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన మహిళ సొసైటీ ఇసుక క్వారీలు ఏర్పాటు చేయుటకు సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించి వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని,
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాల్లో పీసా గ్రామ సభలు ఏర్పాటు చేయవద్దని, తెలియజేయడం జరిగిందని, ఎన్నికల కోడు ఎత్తివేసిన చోట పీసా గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో చర్చించిన అంశాలను పరిగణలోనికి తీసుకొని , పట్టా ల్యాండ్స్ పై జాయింట్ సర్వే నిర్వహించి పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల పై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది అని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏడి మైన్స్ రఘు బాబు, టి ఎస్ ఎం డి సి ఐ .రవి ఇరిగేషన్ ఈ ఈ డివిజన్ నెంబర్-04 వెంకట కృష్ణ,, ములుగు డి సి ఓ సర్దార్ సింగ్, ఏటూరునాగారం ఇరిగేషన్ డివిజన్ 2 ఏ.ఈ
రాజమౌళి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్
శ్రీకాంత్ , సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post