ప్రెస్ రిలీజ్
తేదీ 25.03.2023
*దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 13 దరఖాస్తులు*
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం CDPO చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బీమదేవర పల్లి స్వరూప గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ ప్రజావాణి కార్యక్రమానికి 13 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపించి సత్వర చర్యలు తీసుకోవాలని CDPO బీమదేవర పల్లి స్వరూప గారు సూచించారు,
ఇందులో 02 దరఖాస్తులు వ్యక్తిగత లోన్ల కోసం, 04 దరఖాస్తులు దివ్యాంగుల నాలుగు చక్రాల వాహనం కోసం, 05 దరఖాస్తులు డబుల్ బెడ్ రూమ్, 01 దరఖాస్తు పోలీసు సంరక్షణ కోసం,01 దరఖాస్తు అంత్యోదయ కార్డుకోసం సమర్పించారని జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత తెలిపారు.
కార్యక్రమంలో డీఎమ్&హ్ చ్ఓ , పుణ్యవతి ఐసీడీఎస్, డిఆర్డివో శ్రీనివాస్ కమార్,ఆర్ & బి రవీందర్ , రవీందర్ మెప్మా , దివ్యాంగులు మరియు,
సిడిపివో స్వరూప గారు, సఖి అడ్మిన్ హైమావతి ,సీనీయర్ అసిస్టెంట్ వేణుగోపాల్, జె ఏ రేవంత్ బాబు, ఎఫ్ఆర్వో రవి క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.