జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీర నారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు : జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

పత్రికా ప్రకటన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీర నారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నల్గొండ, సెప్టెంబర్ 26. ఆధిపత్య పెత్తం దారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మ గౌరవ పోరాట నినాదం తో ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం లో దొరల గడీ లను గడ గడ లాడించిన వీర నారి చాకలి ఐలమ్మ అని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వీర నారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర నారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని,పోరాటాన్ని త్యాగాన్ని బావి తరాలకు అందించి ఉద్యమ స్పూర్తి ని రగిల్చిందని అన్నారు.వీర నారి చాకలి ఐలమ్మ ను స్ఫూర్తి గా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతీ లాల్,పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Share This Post