జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం” వేడుకలు : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:31.10.2021, వనపర్తి.

దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి రోజైన అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశ ప్రజలను ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని, స్వేచ్ఛా, స్వాతంత్రం ఫలాలను మనమందరం పొందుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయన భారత హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో ఆయన విలీనం చేయడం జరిగిందనీ, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయుటకు నాంది పలికినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించినట్లు ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డి.వేణుగోపాల్, (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, డిఆర్డివో నర్సింహులు, ఎంప్లాయిమంట్ అధికారి అనిల్, సి.పి.వో.వేంకట్ రెడ్డి , యం.ఆర్.ఓ. రాజేందర్ గౌడ్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post