*జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

నల్గొండ, ఆగస్ట్ 6.ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరంతరం కృషిని,సేవలను తెలంగాణ రాష్ట్రం ఎప్పటికి మరచి పోదని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్తగా,ఉద్యమ స్పూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని అన్నారు.తెలంగాణ ఉద్యమం లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది,ఉద్యమ కారుడి నుండి మహోపాధ్యాయుడు దాకా తెలంగాణకు ఆయన దిక్సూచి గా నిలిచారని అన్నారు.ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆశయ సాధనకు కృషి చేయడం ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు.ఈ కార్యక్రమం లో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్,కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post