జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వార్త ప్రచురణ,
మే-11,2022.
ములుగు జిల్లా :
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య

జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లోబుధవారం రోజున ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొని పెండింగ్ పనులను పైన రివ్యు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో చేపట్టబడిన గురుకులాలు , మోడల్ స్కూల్స్ ,బిటి రోడ్స్ ,అంగన్ వాడి కేంద్రాలు, తదితర వర్క్స్ ఈ నెల చివరి వరకు పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను లను ఆదేశించారు.
ఇప్పటి వరకు జరికిన పనుల మెజర్మెంట్ ,యంబి రికార్డ్స్ ను పరిశీలించారు. యంబి రికార్డ్స్ మరియు ఫిజికల్ గా పూర్తి ఐన పనుల ఫోటోలు లోతో సరి చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు.ఇప్పటివరుకు మంజూరు అయిన పనులు పూర్తి కాకుండా ఉండుటకు గల కారణాలను సంబంధిత ఏ ఇ లను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య తో పనులు పూర్తి కానట్లు ఐతే వారిని బ్లాక్ లిస్టు లో పట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేసారు. వర్షాకాలం సమీపిస్తున్నాయని, మంజూరు అయిన గ్రామ పంచాయితీ భవనాలను మార్చి 31 వరకు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు.
మేడారంలో పనులు చాలా బాగా చేశారని పార్కింగ్ ఈ విషయంలో అర్ధరాత్రి వరకు తమ సేవలు అందించి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకునేందుకు ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇ. ఇ. హేమలత మరియు డి ఇ లు, ఏ ఇ లు పాల్గొన్నారు.

Share This Post