జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి అధిక వర్షాలతో దెబ్బతిన్న కాటారం మండలంలోని దామెరకుంట, గండ్రత్ పల్లి గ్రామాల్లో పర్యటించి ముందుగా దామరకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించి అధిక వర్షాలతో కలిగిన ఇబ్బందులను తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి అధిక వర్షాలతో దెబ్బతిన్న కాటారం మండలంలోని దామెరకుంట, గండ్రత్ పల్లి గ్రామాల్లో పర్యటించి ముందుగా దామరకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించి అధిక వర్షాలతో కలిగిన ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించి అన్నారం బ్యాక్ వాటర్ తో మరియు మానేరు ఉధృతితో తరచుగా మునిగిపోతున్న పంట భూముల వివరాలను మరియు చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమి, దామరకుంట వద్ద కరకట్టను పొడిగించడానికి అవసరమైన భూమి వివరాలను అందించాలని అన్నారం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరిని జిల్లా కలెక్టర్ మరియు సభ్యులు శ్రీధర్ బాబు లు ఆదేశించారు. ఈ పర్యటనలో కాటారం ఎంపీపీ పథకాని సమ్మయ్య, తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో పెద్ది అంజనేయులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్, రైతులు లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post