జిల్లా కలెక్టర్ కె. శశాంక మంగళవారం నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు

జిల్లా కలెక్టర్ కె. శశాంక మంగళవారం నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు

ప్రచురణార్థం

నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్ -26:

జిల్లా కలెక్టర్ కె. శశాంక మంగళవారం నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

ముందుగా నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, భవనం ఎదురుగా ప్లాస్టింగ్ పనులు, విద్యుత్ పనులు, ఫ్యాన్ ల ఏర్పాటు, ఏ.సి. పనులు, ఫాల్ సీలింగ్ పనులు, పుట్టి, ఫ్లోరింగ్ పనులు పూర్తి చేసి కలరింగ్ పనులను చేయాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కె. శశాంక కలెక్టరేట్ నూతన కార్యాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించి, నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో భవనం ఆవరణలో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కొమురయ్య, ఆర్ అండ్ బి – ఎస్.ఈ. నాగేందర్, ఈ.ఈ. తానేశ్వర్, ఏ. ఈ., డి.ఈ.సి. కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ సంపూర్ణ రావు, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.

—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post