తేదీ.1.2.2023.
సూర్యాపేట.
.
జిల్లా అభివృద్ధికిఅధికారులందరు ప్రత్యేకకృషిచేయాలని,నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )పాటిల్ హేమంత కేశవ్ నుండి కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పుషగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పూజారులు మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు.
తదుపరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, యస్. మోహన్ రావు లతో కలసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరగాలని ఆదిశగా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. జిల్లా జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి వైద్యాధికారులు, జిల్లా అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ముఖ్య0గా సోమవారం ప్రజావాణి, మంగళ వారం ధరణి, భూసమస్యలు, బుధవారం ఆకస్మిక తనిఖీలు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సమావేశాలు, మండల అధికారులతో సమావేశాలు గురువారం అభివృద్ధి, సంక్షేమ పథకాల పరిశీలన ,లాండ్ ఎక్వజేషన్ పై సమావేశం, శుక్రవారం వాటరింగ్ డే, ఉపాధి హామీ పనులు పరిశీలన ,శనివారం రోజున రెవెన్యూ కోర్టు నిర్వహణ ఉంటుందని, ప్రతి నెలలో రెండు రోజులు అర్బన్ డే ఉంటుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక పాల్గొనాలని అలాగే ప్రజావాణి ఆన్ లైన్- ఆఫ్ లైన్ కార్యక్రమాలు ఉంటాయని అలాగే వెబేక్స్ ద్వారా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తానని అధికారులు తమ సెల్ ద్వారా ఎక్కడనుంచైన పాల్గొనొచ్చని సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు తాహశీల్దార్లు, mpdo లు, మున్సిపల్ కమిషనర్ లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, వెంక రెడ్డి, సి.ఈ. ఓ సురేష్, పి.డి. కిరణ్ కుమార్, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, ఏడి ఏ రామారావు నాయక్,డి.పి.ఓ యాదయ్య, dfo సతీష్ కుమార్,icds pd జ్యోతి పద్మ, tngos జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
———————————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది.