వరంగల్
ప్రచురునార్ధం
జిల్లా కలెక్టర్ చాంబర్లో శుక్రవారం రోజున రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వివిధ అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి సన్నూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం మ్యాప్ ను పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులు, పాలక మండలి సభ్యులతో వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ చర్చించారు
ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ (R&B ) రాజు తయారు చేసిన మ్యాప్, ఎస్టిమేషను జిల్లా కలెక్టర్ కలెక్టర్
సమక్షంలో కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు అంగీకరించి, ఆమోదం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్. సునీత, డి. ఇ. రమేష్ బాబు, ఆలయ కార్యనిర్వాహక అధికారి జి సుదర్శన్, దేవాలయ కమిటీ మెంబర్ కె రాజేశ్వర్ రెడ్డి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.