జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ, సెప్టెంబర్ 9: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్యను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురువారం కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాకు నూతన కలెక్టర్ గా రావడాన్ని స్వాగతిస్తూ, కలెక్టర్ కు ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గ, జనగామ పట్టణ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే కలెక్టర్ తో చర్చించారు.
ఈ కార్యక్రమంలో జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post