జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం సముదాయం ప్లాంటేషన్, పెద్దగూడెంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
25 .11 .2021 .
వనపర్తి

జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో క్రమపద్ధతిలో ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం సముదాయాన్ని, ప్లాంటేషన్ ను ఆమె పరిశీలించారు. అనంతరం పెద్దగూడెంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులు వరి ధాన్యాన్ని తేమ శాతం తక్కువగా ఉండేలా తీసుకురావాలని ఆమె అన్నారు. అలాగే నర్సరీని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మొక్కలు ఎండిపోకుండా నీరు అందించి, వాటిని సంరక్షించాలని  ఆమె సూచించారు. మొక్కలు ఏపుగా పెరిగే వరకు శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం కడుకుంట్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వైద్యం కొరకు వచ్చే పేద ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆస్పత్రి నిర్వాహకులకు ఆదేశించారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post