పత్రికా ప్రకటన
బాల సదనం, శిశు గృహలో రాఖీ పౌర్ణమి పండుగ
# జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు రాఖీ కట్టిన బాల సదనం, శిశు గృహ అనాథ బాలికలు
నల్గొండ,ఆగస్ట్ 22. రాఖీ పౌర్ణిమ,శ్రావణ పూర్ణిమ దేశ మంతా ప్రజలు ఆనoదోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటున్నారు.నల్గొండ జిల్లా కేంద్రం లో బాల సదనం, శిశు గృహ అనాథ బాలికలు రాఖీ పౌర్ణిమ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,బాలల సంక్షేమ సమితి చైర్మన్ చింత కృష్ణ లకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణిమ పండుగ జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలికలకు నూతన వస్త్రాలు అందచేశారు. ఆదివారం రాఖీ పండుగ రోజున జిల్లా కలెక్టర్ స్వయంగా విచ్చేసి రాఖీ కట్టించుకొని ఆత్మీయం గా తమ మధ్య పండుగ నిర్వహించడం వారు ఆనందం వ్యక్తం చేశారు.సోదర,సోదరి ల అనుబంధానికి గుర్తు గా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పౌర్ణమి పండుగ చేసుకుంటారని కలెక్టర్ అన్నారు.అనాథ బాలికల సంక్షేమం కు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో ముచ్చటిస్తూ పొందుతున్న బాలికలను ఎలా చదువు తున్నారు,బాల సదనం నందు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు.పై చదువులు శ్రద్ధగా కొనసాగించాలని,ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం అవసరమైనా తన వంతు గా సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.
బాలల సంక్షేమ సమితి,నల్గొండ చైర్మన్ చింత కృష్ణ మాట్లాడుతూ బాలికలందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా బాల సదనం, శిశు గృహ నందు జరుగుతున్న మరమ్మత్తు,అభివృద్ధి పనులు పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ E. హరిత,జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.గణేష్,తేజస్వి,విద్య,బాల సదనం, శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.