నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 2021 సం. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు కు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టరుకు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసిన అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించి గౌరవించే అవార్డుకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎలక్టోరల్ ప్రాక్టిస్ విభాగం కింద స్టేట్ కేటగిరీ అవార్డుకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మిర్యాలగూడ ఆర్.డి.ఓ బి. రోహిత్ సింగ్ ,నల్గొండ నాయబ్ తహసీల్దార్ యం.విజయ్ కుమార్ ప్రత్యేక కేటగిరీ అవార్డు లను ప్రకటించారు.
