జిల్లా కలెక్టర్ లతో పోడు భూములపై చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

ఈ నెల 8 నుండి అన్ని జిల్లాల్లో పోడు భూములకు సంబంధించిన క్లైమ్ స్ స్వీకరించడానికి పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణకు గురైన అటవీ భూమి వివరాలను క్షేత్ర స్థాయికి వెళ్లి వివరాలను సేకరించాలని సూచించారు.ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఆక్రమణకు గురైన అటవీ భూములలో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించాలని సూచించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలోని 27 గ్రామ పంచాయతీలలో ఆటవి భూములు అక్రమణకు గురైనట్లు
గుర్తించామని, ఇంకను ఏమైనా ఉంటే గుర్తిస్తామని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు పోడు భూములపై ప్రచారం చేపట్టడం జరిగితుందని, గ్రామ స్థాయి టీంలను ఏర్పాటు చేసి వారికి కూడా పక్కడబందిగా శిక్షణ ఇవ్వడం జరుతుందన్నారు. పోడు భూములపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించినట్లు కలెక్టర్ తెలియజేసినారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్యలతో పాటు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, ఫారెస్ట్ అధికారిని అరుణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post