జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ శుక్రవారం ఈ.వి.ఎం గిడ్డంగిని తణిఖీ చేసారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 22, ఖమ్మం:

జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ శుక్రవారం ఈ.వి.ఎం గిడ్డంగిని తణిఖీ చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపబడే పిరియాడికల్ తణిఖీ నివేదిక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఈ.వి.ఎం గిడ్డంగిని తెరిచి ఈ.వి. ఎంలను పరిశీలించారు. ఈ.వి.ఎం. గిడ్డంగుల వద్ద విధులు పోలీసు గార్డ్ హాజరు, సమయపాలన రిజిస్టర్లను కలెక్టర్ తణిఖీ చేసారు. గిడ్డంగిలోని అగ్నిమాపక పరికరాలను జిల్లా అగ్నిమాపక శాఖాధికారిచే తణిఖీ చేయించి అవసరమైన అగ్నిమాపక పరికరాలను మార్పిడి చేసేందుకు కలెక్టర్ ఆదేశించారు. ఈ.వి.ఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వర్తించే పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సి.సి.టి.వి కెమెరాల ద్వారా పరిశీలిస్తుండాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష్మ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి జయప్రకాష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యాసాగర్, తాజుద్దీన్, గోపాల్, సింగు నర్సింహారావు, ప్రకాష్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post