జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం వైరా పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం వైరా పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రూ. 1.92 కోట్లతో క్రొత్తగా చేపట్టిన స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయన తెలిపారు. ఇండోర్ స్టేడియంకి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా, స్టేడియంను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి, వారిలోని ప్రతిభను వెలికితీయాలని అన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. కూలీలను పెంచి, నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలన్నారు.
అనంతరం షాదీఖానా నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. అగ్రిమెంట్ లో పొందుపర్చిన విధంగా షాదీఖానా వాడుకలో తెచ్చే విధంగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ పర్యటన సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, మునిసిపల్ చైర్మన్ జైపాల్, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, మండల ప్రత్యేక అధికారి కె. సత్యనారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. బి. మాలతీ, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, మునిసిపల్ కమీషనర్ వెంకటపతిరాజు, తహసీల్దార్ అరుణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post