జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. శు క్రవారం “డ్రై డే” సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో జిల్లా కలెక్టర్ పర్యటించి “డ్రై డే” కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రజలకు పలు సూచనలు చేసారు.

ప్రచురణార్ధం
జూలై 30 ఖమ్మం:-
ఇంటి పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. శు క్రవారం “డ్రై డే” సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో జిల్లా కలెక్టర్ పర్యటించి “డ్రై డే” కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రజలకు పలు సూచనలు చేసారు. నగరంలోని వికలాంగుల కాలనీలో ఇంటింటికి తిరిగి నీటి నిల్వలు, ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటిముందు చెత్త చెదారం ఉండరాదని, అపరిశుభ్రత వాతావరణం వల్ల దోమలు వ్యాప్తి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశముంటుందని కలెక్టర్ సూచించారు. వికలాంగుల కాలనీలో కొన్ని ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న కూలర్లలో, నీటి ద్రమ్ములలో వినియోగించని, ఖాళీ పాత్రలు, సీసాలలో ఉన్న నీటి నిల్వలను కలెక్టర్ స్వయంగా తొలగింప చేసి నివాసితులకు అవగాహన కల్పించారు. నీటి నిల్వలవల్ల సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలే ప్రధానమని తదనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎంలు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలతో పాటు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. నగరంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు జరగాలని, ఫాగింగ్, (స్ప్రేయింగ్, యాంటీ లార్వా పనులు ముమ్మరంగా జరగాలని డివిజన్లలో ప్రతి కాలనీలో “డ్రే డే” కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశంచారు. నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతి, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యరాణి, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశరీ, మెడికల్ ఆఫీసర్ కనకదుర్గ, ఏ.ఎం.ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియ అధికారి డా॥ సంధ్య, అధికారులు, కార్పోరేటరు రఫీదాబేగం తదితరులు పాల్గొన్నారు.


—————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post