జిల్లా కు ఫిక్కి చైర్మన్ సందర్శన.. తేది 06.05.2022.నాడు ఫిక్కి చైర్మన్ సుభ్రమహేశ్వరి మరియు ఫిక్కి సభ్యుల బృందం 15 మంది సందర్శించారు- జిల్లా కలెక్టర్ డి. హరిచందన

నారయణపేట జిల్లా కు ఫిక్కి చైర్మన్ సందర్శన…..

తేది 06.05.2022.నాడు ఫిక్కి చైర్మన్ సుభ్రమహేశ్వరి మరియు ఫిక్కి సభ్యుల బ్రుందం 15 మంది జిల్లా కు సందర్శించారు. సందర్శన ముఖ్య ఉద్దేశ్యం జిల్లా లోని చేనేత కుటుంబాల స్థితిగతులు అధ్యాయనము చేయడము హాండ్లూమ్ లో నూతన డిజైన్, మార్కెట్ మొదలగు అంశాలు పరిశిలించడము.  ఈ క్రమములో ఫిక్కి చైర్మన్ మరియు సభ్యులు చేనేత కుటుంబాల వారితో గాంధినగర్  నందు సోసైటి సభ్యులతో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో సభ్యులు సోసైటి మరియు నాయకులు ప్రస్తుతం చేనేత కుటుంబాల స్థతిగతులను వారియొక్క సమస్యలను ఫిక్కి పెద్దల ద్రుష్టి కి నివేదించడం జరిగింది. ఫిక్కీ సభ్యులు చేనేత వారికి కావలసిన మార్కేటింగ్, డిజైన్ ల నందు సహకారం అందిస్తామని తేలియజేశారు. ఫిక్కి సభ్యులు చేనేత హండ్లూమ్ ను పరిశిలించడము జరిగింది , అలాగే కలంకారి శిక్షణ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులతో ముచ్చటించడము జరిగింది , అలాగే బి.సి కాలానిలో ఫిక్కీ సభ్యులు తాటాకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి ఆర్థిక అక్షరాస్యతపై రాజం గారి ద్వారా సుమారు 50 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం నందు చేనేత వస్త్ర ప్లదర్శను జిల్లా కలెక్టర్ గారు మరియు ఫిక్కీ సభ్యుల తో కలసి సందర్శించడం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ జిల్లాలో వెనకబాటు రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక రకాల అభివ్రుధ్ధి కార్యక్రమాలు చెపట్టడం జరిగిందని తేలిజేశారు.  ముఖ్యంగా చేనేత వారికి మార్కెటింగ్ , ఇతర సహాకారం అందించుటకు “ఆరుణ్యా” కంపెనీ ఎర్పాటు చేయడం జరిగింది దిని ద్వారా ఇప్పటికే పలురకాల సేవలు జిల్లా మహిళా ఉత్పత్తి దారులకు అందించడం జరిగిందని వివరించారు. అలాగే జిల్లా లో పలు పరిశ్రమల ఎర్పాటు అవకాశాల గురించి ఫిక్కి సభ్యుల కు వివరించడం జరిగింది

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సభ్యులకు ఉచితంగా శానిటరి నాప్కిన్ ఫిక్కి సభ్యులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి.ఆర్.డిఓ. గారు, ఎ.డి.హాండ్లూమ్ గారు జిల్లా సమాఖ్యా సభ్యులు, చేనేత ఉత్పత్తి దారులు, సెర్ప్ సిబ్బంది తడి తరులు పాల్గొన్నారు.

Share This Post