జిల్లా కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్ పరిశీలించారు.

రేపు గురువారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్ పరిశీలించారు.
నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవం,  తదుపరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో  సెమినార్ హాల్ ప్రారంభోత్సవం,  అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో పూజా కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం  చివరగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాలలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ  ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి,  డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ నాగార్జున రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Share This Post