జిల్లా కోర్టు ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ…..

జిల్లా కోర్టు ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ…..

ప్రచురణార్థం

జిల్లా కోర్టు ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ…..

మహబూబాబాద్, జూన్ -2:

జిల్లా కోర్టును వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ గురువారం సాయంత్రం ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు లను చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ లు వర్చువల్ ఆన్లైన్ పద్ధతిన ప్రారంభించారు.

మహబూబాబాద్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పి. వసంత్ ను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

కొత్తగా ఏర్పడిన జిల్లాలకు జిల్లా కోర్టులు ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టు లు ఏర్పాటు చేసి నేడు ప్రారంభించుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి పి. వసంత్, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.అమరావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యువరాజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి రాజ్ కుమార్, జిల్లా కలెక్టర్ కె శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్, జిల్లా కోర్టు జి.పి. వెంకటయ్య, సబ్ కోర్టు జి.పి.ఆనంద్ గుప్తా, జూనియర్ సివిల్ కోర్టు జి.పి. సిద్దార్థ, ఏపిపి చిలకమారి వెంకటేశ్వర్లు, పొక్సో కోర్టు పి.పి. పద్మాకర్ రెడ్డి, పి.పిలు సంతోషి, గణేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి రవి కుమార్, కార్యదర్శి ఎస్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనదీ.

Share This Post