జిల్లా గణాంక దర్శిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పత్రికా ప్రకటన

జిల్లా గణాంక దర్శిని ఆవిష్కరించిన కలెక్టర్

నల్గొండ,సెప్టెంబర్ 9 .జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుటకు జిల్లా గణాంక దర్శిని ఎంతో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.జిల్లా ప్రణాళిక శాఖ రూపొందించిన 2019-20 సం. జిల్లా గణాంక దర్శిని(district handbook of statistics) పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం లో జనాభా,అన్ని శాఖల సమగ్ర సమాచారం తో పాటు వర్ష పాతం, పంటల సాగు,జిల్లాలోని మౌలిక వనరుల వివరాలు ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాల శౌరి, సహాయ సంచాలకులు ఎల్.శ్రీనివాస్, ఉప గణాంక అధికారి జి.శ్రీనివాస్,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Share This Post